ఏపీలో కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలు వ్యవహారంపై వైకాపా.. భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డి, బిజెపి మధ్య ట్వీట్ల ప్రవాహం సాగుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర బిజెపి గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఐతే ఇప్పుడు మరోసారి విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. కన్నా లక్ష్మీనారాయణ అవినీతి వ్యవహారమంతా తనకు తెలుసని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో భాజపా అధినాయకత్వం రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చింది.. అందులో ఎంత దుర్వినియోగం జరిగిందనే వివరాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఆ పార్టీలో కన్నా, పురందేశ్వరి ఎంత తీసుకున్నారు? ఏయే నియోజకవర్గాలకు ఎంతెంత పంపించారనే వివరాలు లెక్కలతో సహా తన వద్ద వున్నయాని, ఆయా ఖర్చులను భాజపా అధిష్ఠానానికి అందజేశారా? అని చురకటించారు విజయసాయి రెడ్డి.