విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పేదలకు నిత్యావసర వస్తువులను ప్రగతి భారతి ట్రస్ట్ పంపిణీ చేస్తోంది. ఈ ట్రస్ట్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ది . ఏ ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ను పెట్టారో.. ఎప్పుడు పెట్టారో కానీ.. ఈ లాక్ డౌన్ సమయంలో మాత్రం ఫుల్ యాక్టివ్ అయిపోయింది.
కాగా ట్రస్టు ముసుగులో బలవంతపు వసూళ్లకు, పంపిణీ ముసుగులో వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ‘కరోనా’.. వైసీపీ నాయకులకు ఏటీఎంగా మారిందని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలను నిరసిస్తూ మండల స్థాయిలో కూడా దీక్షలు నిర్వహించాలని, 12 గంటల దీక్షలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.