కిరణ్ హీరో కాదు జీరో !!

vhరాష్ట్ర విభజనను అడ్డుకుని సీమాంధ్ర ప్రాంతంలో సీఎం కిరణ్ హీరో కావాలనుకుంటున్నారని… కానీ, ఆయన జీరో అవుతారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. సీఎం ఎన్ని ప్రయత్నాలు చేసిన తెలంగాణ రాష్ట్రం మాత్రం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. ఈ రుణాన్ని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తీర్చుకుంటారని తెలిపారు. విభజన బిల్లు భోగి మంటల్లో వేయాలన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుపై వి హెచ్ నిప్పులు చెరిగారు. అశోక్ బాబు తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్నారు. నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.