కేసీఆర్ ది సింగిల్ దుకాణం : విహెచ్

VHతెరాస అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు విరుచుకుపడ్డారు. విహెచ్ ఈరోజు (శుక్రవారం) విలేకరులతో మాట్లాడుతూ.. “కేసీఆర్ ది సింగిల్ దుకాణం.. సింగిల్ పార్టీ” అంటూ ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చేవారిని అడ్డం పెట్టుకుని పబ్బం గడపుకోవడం కేసీఆర్ కు అలవాటే అని ఆయన దుయ్యబట్టారు. కాగా, తెలంగాణ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు అతిగా స్పందించడం వల్లే ఆయన పదవి ఊడిందనే అభిప్రాయాన్ని విహెచ్ వ్యక్తం చేశారు. పనిలో పనిగా విహెచ్ ముఖ్యమంత్రిపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని ఆరోపించారు. మంత్రులను తొలగించినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని విహెచ్ అన్నారు.