కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా విద్య, వైద్యం మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఉచిత పథకాల కంటే ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అందించి మౌలిక వసతుల కోసం కేటాయింపులు పెంచటం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వాలు విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యతను ఇచ్చిన అనంతరం, వ్యవసాయం మీద కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు, అందుకు తగిన మౌలిక వసతులు అందించడం ప్రభుత్వాల విధిగా పేర్కొన్నారు. క్రింది స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు పటిష్టంగా అమలయ్యేలా జిల్లా స్థాయి అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.