జైపాల్ రెడ్డి తనకు 40 ఏళ్ల స్నేహితుడు అంటూ వెంకయ్య నాయుడు అన్నారు. ఇద్దరం కూడా ఒకేసారి రాజకీయ జీవితంను ఆరంభించినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. జీవితంలో తామిద్దరం ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని వచ్చాం. అసెంబ్లీలో పక్క పక్కనే కూర్చునే వాళ్లం. 40 ఏళ్ల బంధంను గుర్తు తెచ్చుకున్న వెంకయ్య నాయుడు కన్నీరు ఆగక పోవడంతో సంతాప తీర్మానం చదివిన వెంటనే కన్నీరు తీర్చుకున్నాడు. ఏడుపు స్వరంతోనే వెంకయ్య నాయుడు సంతాప తీర్మానంను చదివి వినిపించారు.