పాకిస్తాన్ యుద్దం విమానం ఇండియ గగణతలంపైకి వచ్చిన సమయంలో ధైర్య సాహసాలతో అభినందన్ ఆ విమానంను కూల్చి వేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో అభినందన్ విమానం పాక్ గగనతం నుండి పాక్ భూ భాగంలో కూలింది. ఆ సమయంలో పాకిస్థాన్ జనాలు ఆయన్ను చంపేందుకు ప్రయత్నించారు. అయితే ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. పాకిస్తాన్ ఆర్మీ వారు అభినందన్ నుండి ఇండియన్ ఆర్మీ రహస్యాలను చెప్పాలని బలవంతం చేసినా కూడా ఏమాత్రం బెనకకుండా ఏ విషయాలు చెప్పలేదు.
అంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్‌కు కేంద్ర ప్రభుత్వం సైనికులకు ఇచ్చే మూడవ అత్యున్నత పురష్కారం అయిన వీర్ చక్రను ఇవ్వబోతుంది. పరమ్ వీర చక్ర, మహావీర చక్రల తర్వాత మూడవ అత్యున్నత పురష్కారం వీర్ చక్ర. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు మంచి గౌరవం తెచ్చిన అభినందన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.