Site icon TeluguMirchi.com

“వస్తున్నా.. మీకోసం” @2000 కి.మీ

NCBNతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర ఈ రోజు (మంగళవారం)తో 2,000 కి.మీ మైలురాయిని చేరుకోనుంది. పాదయాత్రలో భాగంగా ఈరోజు గుంటూరు నగరం ఆర్టీసీ బస్టాండు వద్ద ఎన్టీఆర్ సర్కిల్ కు చేరుకునే సరికి రెండువేల కి.మీ మైలు రాయిని చేరుకుంటుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి.

ఎన్ని శారీరక ఇబ్బందులున్నా.. పార్టీ నేతలు వద్దని విజ్ఞప్తి చేసినా.. వైద్యులు వారిస్తున్నా… తన పాదయాత్రను కొనసాగిస్తున్న.. బాబు మారుమూల గ్రామాలలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. దేశంలో ఏ రాజకీయనాయకుడు కూడా ఇంతగా ప్రజలకోసం..ఇన్ని కి.మీ ల పాదయాత్ర చేసి ఉండరు అనడంలో అతిశయోక్తిలేదని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.

అక్టోబర్ 2వ తేదిన అనంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్ర ప్రారంభించిన బాబు ఇప్పటికి 12 జిల్లాలు దాటి 13వ (గుంటూరు) జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. 107 పట్టణాలు, రెండు నగరాలు, 107 మండలాలు, 55 నియోజకవర్గాల మీదుగా బాబు “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర సాగింది.

మధ్యలో మహబూబ్ నగర్ జిల్లా గద్వాల వద్ద వేదిక కూలినప్పుడు, ఎర్రనాయుడి మృతి చెందినప్పుడు మరియు తుఫాను భాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు మినహా మరెప్పుడు కూడా బాబు పాదయాత్రను ఆపలేదు. ఎవరు ఎన్ని విధాల వారించినా.. “లేదు నేను నడవాలి.. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి నడుస్తాను.. నాకు ఆ శక్తి ఉందిని” చెబుతూ.. పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారని ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు చెబుతున్నారు.

 

Exit mobile version