పవన్’ఇజమ్’పై వర్మ సెటైర్ !

Ram-Gopal-Varma-Tweets-On-I

పవన్ కళ్యాణ్ ను పవర్ ఫుల్ గా పొగడిన వారిలో వర్మ ప్రథముడు. పవన్ పొలిటికల్ ఎంట్రీపై ఫస్ట్ పెదవి విప్పింది కూడా ’వర్మా’నే. అప్పటి నుంచి వర్మ పవన్ జపం చేస్తూ వస్తున్నాడు. ’జనసేన’పై ప్రసంశల వర్షం కురిపించారు. ’శివసేన’ కంటే.. ’జనసేన’ వేయిరెట్లు బెటరని పొగిడేశాడు. అంతటితో ఆగకుండా.. పవన్ ను దేవుడితో పోల్చాడు. జనాలు దేవాలయాలకు వెళ్లకుండా.. పవన్ బాటలో పయనమవ్వండని పిలుపునిచ్చాడు. ఎప్పుడూ.. పొగిడితే పరమబోర్ అని ఫీలయినట్టున్నాడు మన వర్మ. ఈసారి దారి మార్చాడు. తాజాగా, పవన్ ’ఇజం’ పుస్తకంపై సెటైర్ వేశాడు. ‘ఇటీవలే ఇజమ్ పుస్తకాన్ని చదివాను, ఆ తరువాత నాకు చాలా సందేహాలు కలిగాయి. ఇజమ్ పుస్తకం రాసిన రచయితలకైనా అర్థమవుతుందా.. ?? అనే అనుమానం వచ్చిందని’ ట్వీట్ చేశారు. అందరికీ అర్థమయ్యేభాషలో పవన్ కల్యాణ్ ఇజమ్ పుస్తకాన్ని తీసుకువస్తారని ఊహించానని వర్మ ట్వీట్ చేశారు. ఏదేమైనా.. తన చిత్ర-విచిత్రమైన కామెంట్స్ తో ఎప్పూడూ వార్తల్లో వుండటమే వర్మ స్టైల్ మరీ. వర్మ సెటైర్ కి పవన్ రీసెటైర్ ఎలావుండబోందో.. !!