Site icon TeluguMirchi.com

కొడాలి నాని ఫై వర్మ కామెంట్స్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..ఏపీ మంత్రి కొడాలి నాని ఫై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. రీసెంట్ గా జరిగిన సంక్రాంతి వేడుకల్లో గుడివాడ ను గోవా ను తలిపించారు నాని. సంక్రాంతి వేడుకల్లో క్యాసినో, జూదం, పేకాట, అమ్మాయిలు, అసభ్యకర నృత్యాలు.. వంటి అసాంఘిక కార్యకలాపాలు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారాడు.

తెలుగు దేశం నాయకులు అయితే నాని ఫై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా కొడాలి నానిపై కామెంట్స్ చేశారు. “గుడివాడను లండన్, పారిస్, లాస్ వెగాస్‌ల సరసన నిలిపారు. గుడివాడ ప్రజలు గోవాకు వెళ్లిన ఫీలింగ్‌ను నాని కల్పించారు” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version