టీడీపీ నేత వర్ల రామయ్య లాక్ డౌన్ పరిస్థితులు, సడలింపుల అంశంపై స్పందించారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల మద్యం అమ్మకాలకు అనుమతి సరికాదని సీఎం జగన్ కు హితవు పలికారు. గ్రీన్ జోన్ లో మద్యం విక్రయిస్తే, ఆ మద్యం తాగిన మందుబాబుల ప్రభావం రెడ్ జోన్లపై పడుతుందని వర్ల రామయ్య వివరించారు. ఇది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుందని, అప్పుడు కరోనాను కట్టడి చేయడం శక్తికి మించిన పనవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజారోగ్యం దృష్ట్యా మద్యం విక్రయాలు నిలిపివేయాలని సూచించారు.
కాగా రాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన అనుమతులతో రేపట్నుంచే 20 డిస్టలరీలు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.