పవన్ కళ్యాణ్ కు వర్ల ప్రశ్న

ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, విద్యా వేత్తలు, సామాజిక, రాజ‌కీయ నాయ‌కులు తదిత‌రుల‌తో జేఎఫ్‌సీని ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. జేఎఫ్‌సీ ఏ వ్యక్తిగత, రాజకీయ స్వార్థం, వివక్ష లేకుండా ఏపీ పునర్విభజన హామీలను విశ్లేషించి నివేదిక అందిస్తుందని చెప్పారు.

తాజాగా దీనిపై టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. జేఎఫ్‌సీ సమావేశానికి కాంగ్రెస్‌ నేతలను పిలవడం సమంజసమా అని పవన్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను జేఎఫ్‌సీ సమావేశానికి పిలిచే అంశాన్ని పవన్‌ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇక వైకాపా అధినేత జగన్‌ ఓ అవగాహన రాహిత్య చక్రవర్తి అని, లోక్‌సభ సభ్యులతో రాజీనామా చేయిస్తానన్నారని , మరి విజయసాయి రెడ్డితో ఎందుకు చేయించరని ప్రశ్నించారు. కేంద్రాన్ని కూడా పవన్‌ శ్వేతపత్రం అడగాలని కోరారు వర్ల.