జనం పేరిట చందాలు వసూలు చేసే ఖర్మ వైఎస్సార్సీపీకి లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కరోనా’.. వైసీపీ నాయకులకు ఏటీఎంగా మారిందని, వసూళ్ల దందాకు పాల్పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అవంతి ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఇంట్లో హైదరాబాద్లో ఉండి వైఎస్సార్సీపీ నేతలపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని తమ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కరోనా’ సంక్షోభంతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు ‘హెరిటేజ్’, ఎన్టీఆర్ ట్రస్ట్ లు ఏమి ఇచ్చాయి? ప్రజల కోసం చంద్రబాబునాయుడు ఏపీకి రావొచ్చుగా? అని ప్రశ్నించారు.