తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా ..బిజెపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న ఆయన, బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. వైసీపీలో కీలకంగా పనిచేసిన వంగవీటి రాధా.. తనకు సీటు ఇవ్వలేదన్న కారణంతో గతేడాది ఎన్నికల ముందు టీడీపీలో చేరారు.
ఆ సమయంలో జగన్పై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే టీడీపీ కూడా ఆయనకు సీటు ఇవ్వలేదు. అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ కార్య క్రమాలకు దూరం ఉంటూ వస్తున్న ఈయన..ఇప్పుడు బిజెపి లోకి చేరేందుకు డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం బిజెపి కేంద్ర మంత్రి తో సంప్రదింపులు చేస్తున్నారట.