Site icon TeluguMirchi.com

హనుమన్న పార్టీ మారనున్నాడా?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు వి హనుమంతరావు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి ఉన్న నేత అంటూ విహెచ్‌కు గుర్తింపు ఉంది. రాజీవ్‌గాంధీకి వీర విధేయుడిగా అప్పట్లో ఉన్న విహెచ్‌ కాల క్రమంలో తన ప్రాభవంను కోల్పోయాడు. పార్టీలో జూనియర్‌లు కూడా ఈయన్ను గౌరవించడం లేదు. ఈయన రాజకీయ అనుభవం అంత వయసు లేని వారు కూడా వీహెచ్‌పై పెత్తనం చేయడం వంటివి చేస్తున్నారట. దాంతో ఆయన ఇక కాంగ్రెస్‌లో కొనసాగడం ఏమాత్రం కరెక్ట్‌ కాదనే నిర్ణయానికి వచ్చాడట.

వీహెచ్‌ మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మంలో పోటీ చేయాలని బలంగా ప్రయత్నించాడు. పీసీసీ ప్రెసిడెంట్‌తో పాటు పలువురికి విజ్ఞప్తి చేశాడు. కాని కనీసం వీహెచ్‌ పేరును పరిశీలనలోకి కూడా ఉత్తమ్‌ తీసుకోలేదు. ఆ పరిణామంతో వీహెచ్‌ బాగా నొచ్చుకున్నాడు. అప్పటి నుండే పార్టీకి కాస్త దూరం ఉంటు వస్తున్నాడు. త్వరలోనే రాజీవ్‌ గాంధీ జయంతి ఉంది. ఆ రోజున లేదా ఆ తర్వాత అయినా తన నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే తన సన్నిహితులు మరియు కార్యకర్తలతో భేటీ అయ్యాడు. హనుమన్న ఏ పార్టీకి వెళ్తాడు అనేది చూడాలి.

Exit mobile version