ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 22 మంది మృతి


ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లా దుమ్టాలో ఓ బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 28 మంది ఉన్నారు.ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. గాయపడిన 6 మందిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి.