కేసీఆర్ పై వాయిస్ పెంచిన కాంగ్రెస్


మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెరపైకి వచ్చింది. కరోనా నేపధ్యంలో కొన్నాళ్ళుగా సైలంట్ అయిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు వాయిస్ వినిపించింది. కరోనా నేపథ్యంలో గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, నగదు సాయం పేదలకు ఇప్పటికీ అందలేదని.. వలస కూలీల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

అఖిలపక్ష సమావేశం అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 5కిలోల బియ్యం ఏమయ్యాయని.. వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తోందా లేదా వేరుగా ఇస్తున్నారా అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు ఉత్తమ్‌.