Site icon TeluguMirchi.com

కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్

కరోనా టెస్టుల విషయం లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై మండిపడ్డారు కాంగ్రెస్ నేత ఉత్తమ్. కరోనా పరీక్షలు చేయకుండానే సూర్యాపేటను కరోనా‌ రహిత జిల్లాగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. సూర్యాపేటతో పాటు రాష్ట్రంలో ఏప్రిల్‌ 22 నుంచి ఇప్పటి వరకు ఎన్ని కరోనా పరీక్షలు చేశారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

“మీ ఇష్టమొచ్చినట్టు రంగులు మార్చడం మీ రాజకీయంలో నడుస్తదేమో, కరోనాతో కాదు. టెస్టులు చేయకుండా సూర్యాపేటను గ్రీన్ జోన్ గా ఎట్లా నిర్ధారించారు? టెస్టుల విషయంలో హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాదు. మీకు చేత కాదు, మేము సలహాలిస్తే వెటకారం చేస్తారు” అంటూ ఉత్తమ్ మండిపడ్డారు.

Exit mobile version