వరకట్న వ్యవస్థని నిర్మూలించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. పెళ్లి సమయంలో తీసుకున్న కట్నం, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఓ ఉత్తర్వులో పేర్కొంది. దీంతో వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 10 వేల మంది ఉద్యోగులు, అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి వరకట్న వివరాలు సమర్పించాల్సి ఉంది.