Site icon TeluguMirchi.com

సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులు!

strikeగత యేడాది తెలంగాణ ఉద్యోగులు చేపట్టిన సకల జనుల సమ్మె అందరికి గుర్తుండే ఉంటుంది. తాజా పరిస్థుతులను చూస్తుంటే మరోసారి సకల జనుల సమ్మె చేపట్టవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి మాత్రం ఇరు ప్రాంతాలు కూడా ఈ దారిలో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతంలోని ఉద్యోగ సంఘాలు మళ్లీ సమ్మెకు సిద్దమవుతున్నాయి. ఒకవైపు ఈనెల 28లోపు తెలంగాణ రాష్ట్రం ప్రకటించకపోతే సకలజనుల సమ్మె చేపడుతామని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రాష్ట్రాన్ని విభజిస్తే సమ్మెకు చేపడతామని ఏపి ఎన్జీవోల సంఘం ప్రకటించింది.

తెలంగాణ ఉద్యోగుల సంఘం కార్యవర్గం అత్యవసరంగా సమావేశమై తెలంగాణ రాష్ట్రం ప్రకటించకపోతే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందనే నమ్మకం ఉందని అధ్యక్షుడు విఠల్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఈ నెల 28లోగా తెలంగాణ ప్రకటించకపోతే సమ్మెతప్పదని హెచ్చిరించారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ప్రకటించకపోతే ఎన్ని రోజులు సమ్మెచేయాలి, సమ్మెవిదివిధానలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. గతంలో టీఎన్జీవో సంఘం పిలుపు మేరకు సకలజనుల సమ్మె చేపట్టగా సమ్మె విజయవంతమైంది. కాగా ఇటువంటి సందర్బంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే అదే బాటలో నడువాలని టీఎన్జీవో సంఘం నిర్ణయం తీసుకుంది.

Exit mobile version