Site icon TeluguMirchi.com

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇంతే…!

కేంద్ర బడ్జెట్ తెలుగు రాష్ట్రాలను ఊసురుమనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు నామామాత్రపు కేటాయింపులతో సరిపెట్టింది. ఏపీలోని సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు మరియు ఏపీ ట్రైబల్‌ వర్సిటీకి రూ. 8కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అదే విధంగా తెలంగాణలోని హైదరాబాద్‌ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు. ఇక భారీ రెవిన్యూ లోటు తో ఉన్న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ పై పెట్టుకున్నఆశలు ఫలించలేదు..

విజయవాడ,విశాఖ మెట్రో రైలుకు నిధుల ఊసే బడ్జెట్ లో కనిపించలేదు. డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి పథకాలకు ఓవర్ డ్రాఫ్ట్ 5000 మాత్రం కొంతలో కొంత బెటర్ గా చెప్పుకోవాలి. భారతమాల, సాగరమాల తదితర పథకాలలో ఏపీకి ఎంత కేటాయించారనే దానిపై కుడా స్పష్టత లేదు. చిన్న వర్తకులకు పెన్షన్, అందరికీ ఇళ్ల పథకాలు మాత్రం కొంతలో కొంత నిధులు రాబట్టగల అంశాలు. ఇక జీరో బడ్జెట్‌ వ్యవసాయంపై కూడ ఒక స్పష్టత లేదు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక బడ్జెట్ ఏపీని పూర్తిగా నిరాశ పరిచిందన్నారు.

Exit mobile version