Site icon TeluguMirchi.com

విభజన కోసం మరిన్ని రాష్ట్రాలు !

Undavalliతెలంగాణలా అసెంబ్లీతో సంబంధం లేకుండా విభజన జరగాలని అడిగేందుకు పలు రాష్ట్రాలు కాచుక్కూర్చున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ఏకాభిప్రాయం, మెజార్టీ అభిప్రాయంతోనే కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఉండవల్లి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. హైదరాబాద్ రెండు ప్రాంతాలకు రాజధాని కనుక దానిపై అందరికీ హక్కు ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. ‘తెలంగాణ’ పేరిట గతంలో ఎప్పుడూ రాష్ట్రం లేదని స్పష్టం చేశారు.

గతంలో హైదరాబాద్ అనే రాజ్యం ఉండేదని భారత దేశం ఏర్పాటు తరువాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా తెలుగు మాట్లాడేవారినందర్నీ కలిపి రాష్ట్రం చేశారని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో హైదరాబాద్ అసెంబ్లీలో చర్చ జరిగితే 140 మంది శాసన సభ్యుల్లో 102 మంది ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయాలన్నారనీ, వారి ఆమోదం మేరకే రాష్ట్రం ఏర్పాటైందని ఆయన స్పష్టం చేశారు.

మత హింస బిల్లు, మహిళా బిల్లు, తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడతారని తాను చదివానని, ఆ మూడు బిల్లులపై ఎన్డీయే ఏం సమాధానం చెబుతుందో తమతో పాటు ప్రజలు కూడా గమనిస్తారని ఆయన తెలిపారు.

Exit mobile version