Site icon TeluguMirchi.com

పవన్ వస్తానంటే వద్దాన్నారట


ప్రభుత్వాలను నిలదీయడానికి ఒక జేఏసి అవసరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం . లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులతో ముందుకు వెళ్ళాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే జేపీతో ఆయన కలవడం జరిగింది.

తాజాగా ఈ విషయంపై ఉండవల్లి మాట్లాడారు. తాను ఎప్పుడో రాజకీయాల నుంచి ప్యాకప్ చెప్పేసిన ఆర్టిస్టునని, ఇప్పుడు పవన్ కల్యాణ్ వచ్చి మరోసారి యాక్షన్ అని అంటున్నాడని చమత్కరించారు. ఆయన తన మనసులో ఏమనుకుంటున్నారో ఇంకా తనకు తెలియదని, తాము కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడుకున్నామని వెల్లడించిన ఉండవల్లి, ఆ రెండు నిమిషాల్లో కూడా తానేమీ మేధావిని కాదని, తన పేరు ఎవరు చెప్పారో తెలియదని పవన్ తో అన్నట్టు చెప్పారు. పవన్ తన వద్దకు వస్తానని చెబితే, వద్దని తానే వారించానని, పవన్ రాజమండ్రికి వస్తే, ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని, అందువల్ల తానే హైదరాబాద్ కు వస్తానని చెప్పానని అన్నారు.జయప్రకాశ్ వంటి నేతలు పవన్ వెంట నడిస్తే రాష్ట్రానికి మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు ఉండవల్లి .

Exit mobile version