ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకొంది. ఇకమీద వారంలో మొత్తం నాలుగున్నర రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయని పేర్కొంది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా డబ్ల్యూఏఎం వెల్లడించింది. ప్రస్తుతం యూఏఈలో శుక్రవారం, శనివారం సెలవు దినాలుగా ఉన్నాయి. 2022జనవరి 1వ తేదీ నుంచి వారాంతపు సెలవులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఆదివారం ముగిసే వరకు కొనసాగుతాయి. ఈ నిర్ణయం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది.