Site icon TeluguMirchi.com

అక్కాచెల్లెళ్లిద్దరినీ పెళ్లిచేసుకున్న వరుడు, వరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కర్ణాటకలోని కోలార్​లో అక్కాచెల్లెళ్లిద్దరినీ ఉమాపతి అనే అతను ఒకేసారి వివాహమాడి వార్తల్లోకెక్కాడు. తాజా సమాచారం ప్రకారం ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. అతను పెళ్లి చేసుకున్న వారిద్దరిలో ఒకరు మైనర్ కావడం అరెస్ట్ కి కారణం.

వివరాల్లోకి వెళితే, 31 ఏండ్ల ఉమాపతి.. మూగ, వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను (సుప్రియ, లలిత) వివాహమాడాడు. తన కూతుళ్లకు వేరుగా పెళ్లి చేస్తే.. ఇబ్బందులను ఎదుర్కొంటారని భావించిన తండ్రి.. వయసు గురించి ఆలోచించకుండా ఇరువురికీ ఒకే వరుడినిచ్చి కట్టబెట్టాడు. కాగా ఈ విష‌యం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డంతో పోలీసుల దాకా చేరింది. సుప్రియ సోద‌రి వ‌య‌సు 16 ఏండ్లు కావ‌డంతో.. పెళ్లి చేసుకున్న యువ‌కుడితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Exit mobile version