గీతాంజలి ఆత్మహత్య కేసులో ఇద్దరు అరెస్ట్


తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య ఘటన ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. ట్రోలింగ్స్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుందని వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిమీద ఒకరు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో గీతాంజలి కి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ.. ఈనెల నాలుగో తేదీన గీతాంజలి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇల్లు తీసుకుంది. ఆ సందర్భంగా ప్రభుత్వానికి మద్దతుగా కామెంట్లు చేసింది. దీంతో ప్రభుత్వానికి మద్దతుగా కామెంట్లు చేసిన గీతాంజలి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు తను మౌనంగా ఉంది. నా వీడియో వైరల్ అవుతుంది నన్ను తిడుతున్నారు అంటూ బంధువుల దగ్గర వాపోయింది. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లతో తీవ్ర ఆందోళన చెందిన గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ట్రైన్ లోకో పైలట్ ఆమెను కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేశారు. ట్రైన్ తగలడం తో తలకు తీవ్ర గాయం అవ్వడంతో ఆమె చనిపోయింది. ఆమె సోషల్ మీడియా ఎకౌంట్ చూస్తే వందల సంఖ్యలో వచ్చిన బ్యాడ్ కామెంట్లు బాధ కలిగించాయి. అవే ఆమె ప్రాణాలు తీసి ఉండొచ్చు. కొన్ని టీంలు పెట్టి దర్యాప్తు ప్రారంభించాం. రాంబాబు , వెంకట దుర్గారావు అని ఇద్దరు వ్యక్తులు అసభ్య కామెంట్లు పెట్టారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసాం. మరికొన్ని ఎకౌంట్ల పై దర్యాప్తు చేయాల్సి ఉంది. ఓ మహిళ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు.