ఉద్యోగులకు పిలుపునిచ్చిన టీటీడీ..

కరోనా వైరస్ కారణంగా టీటీడీ బోర్డు భక్తులను అనుమతించడం బంద్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే టీటీడీ ఉద్యోగులను సైతం ఇంటికే పరిమితం చేసింది. దాదాపు నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్న వీరికి టీటీడీ నుండి మళ్లీ పిలుపు వచ్చింది.

ఆలయం, విజిలెన్స్‌, ఫారెస్ట్‌, ఇంజినీరింగ్‌ వంటి విభాగాలకు సంబంధించిన అందరు ఉద్యోగులు సోమవారం నుంచి విధులకు హాజరవ్వాలని ఆదేశించింది. మిగిలిన విభాగాల్లో 33 శాతం సిబ్బంది హాజరు కావాలని తెలిపింది. లాక్‌డౌన్‌ ముగిసే వరకు నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. అయితే చంటిబిడ్డల తల్లులు, 65 ఏండ్లు పైబడినవారికి మినహాంపు ఇస్తున్నట్లు వెల్లడించింది.