Tirumala : టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు


తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది …

* స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి నిర్ణయం..

* టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫారస్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కొసం అదనంగా భవనాలు నిర్మాణానికీ నిర్ణయం..

* 2014వ సంవత్సరానికి ముందు టీటీడీలో నియమింపబడిన కాంట్రాక్టు,పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు..

* యాత్రి సముదాయంలో లిఫ్ట్ లు ఏర్పాటుకు 1.88 కోట్లు..

* బాలాజినగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు నిర్ణయం..

* 14 కోట్లతో టీటీడీలోని 188 క్వార్టర్స్ ఆధునికరణ..

* గోవిందరాజ స్వామి ఆలయంలో బాష్యాకర్ల సన్నిధిలో మకరతోరణం ఏర్పాటుకు ఆమోదం..

* ఐటీ సేవల కొసం 12కోట్ల నిధులు మంజూరు..

*శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆమోదం..

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబంకు 5లక్షలు పరిహారం..