శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి నిర్ణయాన్ని టీటీడీ వాయిదా వేసింది. 14 నుంచి భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించాలని ముందుగా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా నిర్ణయాన్ని టీటీడీ వాయిదా వేసింది. భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్లు టీటీడీ ప్రకటించింది.