ఈ రోజుల్లో వసతి గదుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ను రద్దు చేసిన టిటిడి

తిరుమలలో జనవరి 11-14వ తేదీ వరకు గదుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని 11-14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ను టిటిడి రద్దు చేసింది.

శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ తిరుమలలోని అన్ని గదులను కరెంట్‌ బుకింగ్‌ ద్వారా కేటాయించాలని తితిదే నిర్ణయించింది. ఎమ్‌బీసీ-34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టీబీసీ కౌంటర్‌, ఏఆర్‌పీ కౌంటర్లలో 2022 జనవరి 11వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 14వ తేదీ అర్ధరాత్రి 12గంటల వరకు గదులు కేటాయించబోమని అధికారులు తెలిపారు. జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్‌ ఉండదని స్పష్టం చేశారు.