Site icon TeluguMirchi.com

సోషల్ మీడియా లో తిరుమల ఆలయం డ్రోన్ వీడియో, అప్రమత్తమైన టీటీడీ


తిరుమల ఆలయంపై నో ఫ్లై జోన్ ఆంక్షలు ఉన్నాయి. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. తాజాగా ఆలయం డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించడం కలకలం రేపుతోంది. ఆలయం మీదుగా డ్రోన్ కెమెరా ఎగురుతూ తీసినట్టుగా ఉంది ఆ వీడియో.

ఆ వీడియోతో ఉలిక్కిపడిన టీటీడీ వెంటనే అప్రమత్తమైంది. తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్‌ కెమెరాతో షూట్ చేసిన వీడియో నిజమైందా? కాదా? అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. సైబర్‌ క్రైమ్‌ టీమ్ తో వీడియోను తనిఖీ చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఈ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసినట్టు గుర్తించారు. పూర్తిస్థాయిలో తనిఖీచేసి ఈ వీడియో అసలైందా? నకిలీదా? అని గుర్తించి బాధ్యుతలపై చర్యలు తీసుకుంటామని తెలిపింది టీటీడీ.

Exit mobile version