ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు TSRTC ఎప్పటికప్పుడు వినూత్నమైన రీతిలో ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటిస్తూ వస్తుంది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో TSRTC మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పిస్తోంది. అన్ని రకాల బస్ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తోంది. ఈ ఏడాది జూన్ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుంది. మీఇంట్లో జరిగే పెళ్లిళ్లకు, లేదా మీ సంస్థ లేదా మీ కుటుంబం యొక్క విహారయాత్రలకు లేదా ఇతర ఏ శుభకార్యానికైనా బస్సును బుక్ చేసికోవచ్చని TSRTC తెలిపింది. ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.