Site icon TeluguMirchi.com

టీఎస్ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు తెలిపిన సజ్జనార్ – ఇకపై ప్రతినెల ఒకటినే వేతనాలు

టీఎస్ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు తెలిపారు సజ్జనార్. ప్రతి నెల ఒకటినే వేతనాలు అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కొనసాగుతుంది. కరోనా కారణం ఒకటైతే , పెరుగుతున్న డీజిల్ ధరలు కూడా ఆర్టీసీని నష్టాల్లో పడేస్తుంది. అయినప్పటికీ కార్మికులకు ప్రతి నెల ఒకటోనే జీతాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం ప్రతినెల 7వ తేదీ నుంచి 14వ తేదీలోపు విడతల వారీగా, జోన్ల వారీగా చెల్లిస్తున్నారు.

దసరా నేపథ్యంలో నేడే వేతనాలు అందనుండడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇటీవల ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కూడా ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలోని దాదాపు 48 వేల మంది ఉద్యోగులు, పెన్షనర్లు నేడు వేతనాలు అందుకోనున్నారు. కార్మికులకు తీపి కబురు తెలిపిన సంస్థ..ప్రయాణికులకు మాత్రం చేదు వార్త త్వరలోనే చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఆర్టీసీ టికెట్ చార్జీలు పెరగబోతున్నాయి.

Exit mobile version