లాక్ డౌన్ కారణంగా డిపోలకే పరిమితమైన తెలంగాణ ఆర్టీసీ బస్సులు మళ్లీ ఈరోజు నుండి రోడ్డెక్కాయి. కేవలం యాభై శాతం సీట్లలో మాత్రమే ప్రయాణికులకు అనుమతికి బస్సులను నడపబోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో సిటీ బస్సులు నడపడం లేదు.
వరంగల్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి, నల్గొండ వైపు వెళ్లే బస్సులు హయత్నగర్ లేదా ఔటర్ పక్క నుంచి, మహబూబ్నగర్ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుంచి నడవనున్నాయి. కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులకు ఇప్పట్లో అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం తెలిపింది. తొలిదశలో మాత్రం ఇవాళ 6,082 బస్సులు రోడ్డెక్కాయి.