Site icon TeluguMirchi.com

తెలంగాణ లో ఇవి మాత్రం ఓపెన్ కావు..

లాక్ డౌన్ 4 లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొన్ని సడలింపులు చేసారు. క్వారంటైన్‌ జోన్లు మినహా మొత్తం గ్రీన్ జోన్లేనని ప్రకటించారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని షాపులు తెరుచుకోవచ్చని.. కానీ, హైదరాబాద్‌లో కొన్ని పరిమితులు అవసరం అన్నారు.

లాక్‌డౌన్ వరకూ ఫంక్షన్‌ హాల్స్‌, మాల్స్‌, సినిమా హాళ్లు బంద్‌ ఉంటాయని స్పష్టం చేశారు కేసీఆర్.. అలాగే సభలు, ర్యాలీలు, సమావేశాలకు కూడా అనుమతి ఇవ్వబోమని వెల్లడించారు. వీటితో పాటు బార్స్‌, పబ్స్‌, క్లబ్స్‌, జిమ్‌లు, స్టేడియాలు, పార్క్‌లు బంద్‌ ఉంటాయన్నారు. అన్ని విద్యాసంస్థలను మూసివేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్‌ ధరించకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Exit mobile version