తెలంగాణలో నేటి నుంచి (మే 12, బుధవారం) ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుంది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. లాక్ డౌన్ నుండి కొన్ని రంగాలకు వినహాయింపు ఇచ్చారు.
. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ (రైస్ మిల్లు, ఎఫ్సిఐ, ఫర్టిలైజర్, సీడ్ షాప్ లు ) రంగాలకు మినహాయింపు
. ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీలు
. వైద్య రంగం, విధ్యుత్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
. నేషనల్ హైవేలపై పెట్రోల్ బంకులకు అనుమతి
. జాతీయ రహదారులమీద రవాణా యధావిధి
. 33 % సిబ్బందితో ప్రభుత్వ ఆఫీసులు
. బ్యాంకులు, ఏటిఎం లు యధాతదం
. అంత్యక్రియలకు 20 మంది, వివాహాలకు 40 మంది అనుమతి
. ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు మెట్రో, ఆర్టిసి సేవలు, ఇతర రాష్ట్రాలకు బస్సులు బంద్
. ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు రేషన్ షాపులు