తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ అంటూ నాలుగు రోజులు క్రితం ఒక నకిలీ జీవో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తప్పుడు సమాచారంతో కూడిన ఫేక్ జీవోపై నెట్టింట్లో ప్రచారం జరిగింది. కాగా వెంటనే అధికారులు, పోలీసులు ఈ వార్త ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న
నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాదులో కార్వి అండ్ కోలో CAగా పనిచేస్తున్న, నెల్లూరు నివాసి అయిన నిందితుడు శ్రీపతి సంజీవ్ కుమార్ (48) ఏప్రిల్ 1 న తన ల్యాప్‌టాప్ లో ప్రభుత్వ జీఓ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసి దాన్ని ఫోర్జరీ చేసాడు, అనంతరం దానిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు.