తెలంగాణలో ఈనెల 6నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ తెలిపారు. ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని ప్రైవేటు కళాశాలల వారు కొందరు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9లక్షల మంది విద్యార్థుల కోసం 1,443 పరీక్షా కేంద్రాలు, 25వేల మంది ఇన్విజిలేటర్లను సిద్ధం చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.