తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ ఖరారైంది. ఇంటర్ ఫలితాలను మంగళవారం(మే 9) న విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేయనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. స్పాట్ వాల్యూయేషన్ కూడా 20 రోజుల క్రితమే పూర్తి అయింది. ఇక ఇంటర్ ఫలితాలను https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
మరోవైపు పదో తరగతి ఫలితాలను ప్రకటించడానికి వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ ఫలితాలు వెల్లడించిన ఒకటి రెండు రోజుల తర్వాత టెన్త్ ఫలితాలు వెలువడే అవకాశం వుంది.