దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది, రోజు వారి కేసులు 2 లక్షలు దాటుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఈరోజు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
థియేటర్లు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారు. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే మీకు ముఖ్యమా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు బదులుగా.. జనసంచారం నియంత్రణకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం.. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.