శ్రీశైలం అగ్ని ప్రమాదం మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా..

శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో చనిపోయిన డీఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం.. ప్రమాదంలో చనిపోయిన మిగతా వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా.. వారిలో అమర రాజా ఉద్యోగులు మహేశ్, వినేష్ కూడా ఉన్నారు. బ్యాటరీలు మార్చే సమయంలో మంటలు వచ్చాయని అనుమానం ఉందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

అయితే, జెన్ కో హాస్పిటల్ లో మృతుల కుటుంబాల ఆందోళ‌న‌కు దిగాయి.. మార్చురీ ఎదురుగా బైఠాయించిన మృతుల కుటుంబ స‌భ్యులు.. ఏఈ స్థాయి అధికారి కుటుంబాల‌కు కూడా రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియాపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.. హామీ ఇచ్చేవరకు బాడీలు తీసుకెళ్లేది లేదంటూ ఆందోళ‌న‌కు దిగారు.