తెలంగాణ రాష్ట్ర కరోనా హెల్త్ బులిటిన్ ప్రకటించారు. ప్రతి రోజు మాదిరిగానే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2479 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా..వైరస్ కారణంగా 10 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఈ కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,642కు చేరుకోగా… ఇప్పటి వరకు 916 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 యాక్టివ్ కేసులు ఉండగా… వీరిలో 24,741 మంది హోం ఐసోలేషన్లోనే ఉన్నారు.
గత 24 గంటల్లో 2,485 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,15,072కు పెరిగింది. ఇక జిల్లావారీగా కేసులు చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.