తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2892 పాజిటివ్ కేసులు నమోదవగా, 10 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,589కు చేరగా, కరోనా మృతులు 846కు పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 32341 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 25,271 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
జిల్లా వారీగా కేసులు చూస్తే..
జీహెచ్ఎంసీ లో 477 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 234, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 192, కరీంనగర్ 152, నల్లగొండ 174, ఖమ్మం 128, వరంగల్ అర్బన్ 116, సూర్యాపేట 108, సిద్దిపేట 108, నిజామాబాద్ 110, జగిత్యాల 102, పెద్దపల్లి 85, మంచిర్యాల 83, భద్రాద్రి కొత్తగూడెం 81, సంగారెడ్డి 71, కామారెడ్డి 64, మహబూబాబాద్ 61, యాదాద్రి భువనగిరి 60, మహబూబ్‌నగర్ 53, వనపర్తి 51, నాగర్‌కర్నూల్ 45, జనగాం 43, సిరిసిల్ల 39, ఆదిలాబాద్ 38, ఆదిలాబాద్ 38, వరంగల్ రూరల్ 38, మెదక్ 32, నిర్మల్ 31, గద్వాల జిల్లా 28, ములుగు 27, భూపాలపల్లి 21, వికారాబాద్ 15, ఆసిఫాబాద్ 13, నారాయణపేట జిల్లాలో 12 చొప్పున కేసులు నమోదయ్యాయి.