తెలంగాణ రాష్ట్రంలో తాజా కరోనా హెల్త్ బుల్టిన్ ను ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఈ బుల్టిన్ బట్టి గడిచిన 24 గంటలకు సంబదించిన కరోనా హెల్త్ బులిటిన్ ను ఆరోగ్యశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో 2478 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకింది. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 1,35,884కి చేరాయి. ఇందులో 32,994 యాక్టివ్ కేసులు ఉండగా, 1,02,024 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా వల్ల నిన్న 10 మంది బాధితులు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 866కి చేరాయి.
ఇక జిల్లావారీగా కేసులు చూస్తే… జీహెచ్ఎంసీలో 267 నమోదవగా, మేడ్చల్ మల్కాజిగిరిలో 190, రంగారెడ్డి జిల్లాలో 171, నల్లగొండలో 135 కేసులు రికార్డయ్యాయి. ఇక కరీంనగర్‌లో 129, ఖమ్మంలో 128, వరంగల్ అర్బన్‌లో 95, సూర్యాపేటలో 87, కొత్తగూడెం జిల్లాలో 86, కామారెడ్డిలో 85, నిజామాబాద్‌లో 85, సిద్దిపేటలో 82, జగిత్యాలలో 79, మంచిర్యాలలో 69, పెద్దపల్లిలో 68, సంగారెడ్డిలో 67, యాదాద్రి భువనగిరిలో 57, జనగాంలో 51, మహబూబాబాద్‌లో 50, నాగర్‌కర్నూల్‌లో 48, మహబూబ్‌నగర్‌లో 48, రాజన్నసిరిసిల్లాలో 45, ములుగులో 44, నిర్మల్‌లో 44, వరంగల్ రూరల్‌లో 42, మెదక్‌లో 42, వనపర్తిలో 38, ఆదిలాబాద్‌లో 37, గద్వాల జిల్లాలో 36, భూపాలపల్లి జిల్లాలో 24, వికారాబాద్‌లో 17, ఆసిఫాబాద్ జిల్లాలో 16, నారాయణపేటలో 16 కేసుల చొప్పున ఉన్నాయి.