తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,072 కొత్త కేసులు నమోదు కాగా.. 9 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,116 చేరగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 1,89,283 కు చేరింది. 2,259 మంది వైరస్ నుంచి కోలుకొని ఇంటికి వెళ్లగా, మొత్తం1,58,690 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 29,477 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
జిల్లావారీగా చూస్తే..గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ 19, భద్రాద్రి కొత్తగూడెం 85, జగిత్యాల్ 43, జనగాం 28, జయశంకర్ భూపాలపల్లి 27, జోగులమ్మ గద్వాల్ 21, కామారెడ్డి 44, కరీంనగర్ 109, ఖమ్మం 92, కొమరం భీమ్ అసిఫాబాద్ 24, మహబూబ్ నగర్ 44, మహబూబాబాద్ 60, మంచిర్యాల్ 36, మెదక్ 25, మేడ్చల్ మల్కాజ్గిరి 160, ములుగు 23, నాగర్ కర్నూల్ 34, నల్గొండ 139, నారాయణ్‌పేట్ 16, నిర్మల్ 26, నిజామాబాద్ 72, పెద్దంపల్లి 49, రాజన్న సిరిసిల్ల 53, రంగారెడ్డి 161, జీహెచ్ఎంసీ పరిధిలో 283, సంగారెడ్డి 32, సిద్ధిపేట్ 78, సూర్యాపేట 72, వికారాబాద్ 17, వనపర్తి 41, వరంగల్ రూరల్ 33, వరంగల్ అర్బన్ 85, యాద్రాది భువనగిరి 41 కేసులు నమోదయ్యాయి.