తెలంగాణ రాష్ట్రంలో గత పది రోజులుగా కరోనా ఉదృతి మునపటి కంటే భారీగా తగ్గిందనే చెప్పాలి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,554 కొత్త కేసులు నమోదు కాగా …వైరస్ కారణంగా 7 మంది మృతి చెందారు. దీంతో మొత్తం రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య 2,19,224 కు చేరగా, మృతుల సంఖ్య 1,256 చేరింది.
ప్రస్తుతం తెలంగాణలో 23,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 37,46,963కి చేరినట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. అలాగే కరోనా నుంచి తాజాగా 1,435 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,94,653 కు చేరింది.
ఇక కొత్తగా జిలాల్లో నమోదైన కేసులు చూస్తే.. ఆదిలాబాద్ 23, భద్రాద్రి కొత్తగూడెం 95, జగిత్యాల్ 32, జనగాం 22, జయశంకర్ భూపాలపల్లి 15, జోగులమ్మ గద్వాల్ 19, కామారెడ్డి 33, కరీంనగర్ 84, ఖమ్మం 88, కొమరం భీమ్ అసిఫాబాద్ 8, మహబూబ్ నగర్ 21, మహబూబాబాద్ 34, మంచిర్యాల్ 27, మెదక్ 24, మేడ్చల్ మల్కాజ్గిరి 118, ములుగు 21, నాగర్ కర్నూల్ 29, నల్గొండ 79, నారాయణ్‌పేట్ 12, నిర్మల్ 17, నిజామాబాద్ 29, పెద్దంపల్లి 29, రాజన్న సిరిసిల్ల 28, రంగారెడ్డి 128, జీహెచ్ఎంసీ పరిధిలో 249, సంగారెడ్డి 37, సిద్ధిపేట్ 49, సూర్యాపేట 42, వికారాబాద్ 27, వనపర్తి 28, వరంగల్ రూరల్ 30, వరంగల్ అర్బన్ 53, యాద్రాది భువనగిరి 24 కేసులు నమోదయ్యాయి.