Site icon TeluguMirchi.com

తెలంగాణ హెల్త్ బులిటిన్ : 1,446 కొత్త కేసులు , 8 మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుతూ , పెరుగుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,446 కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ఈ కేసులతో కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,238 కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 8 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,241 చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 23,728 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా కేసులు చూస్తే.. కామారెడ్డి 43, కరీంనగర్‌ 74, ఖమ్మం 52, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 9, మహబూబ్‌ నగర్‌ 36, మహబూబాబాద్‌ 22, మంచిర్యాల్‌ 29, మెదక్‌ 24, మేడ్చల్ మల్కాజ్‌గిరి 131, ములుగు 21, నాగర్‌ కర్నూల్‌ 23, నల్గొండ 58, నారాయణ్‌పేట్‌ 7, జీహెచ్‌ఎంసీ పరిధిలో 252, ఆదిలాబాద్ 16, భద్రాద్రి కొత్తగూడెం 59, జగిత్యాల్‌ 32, జనగాం 25, జయశంకర్ భూపాలపల్లి 12, జోగులమ్మ గద్వాల్‌ 21, నిర్మల్‌ 19, నిజామాబాద్‌ 39, పెద్దంపల్లి 30, రాజన్న సిరిసిల్ల 29, రంగారెడ్డి 135, సంగారెడ్డి 50, సిద్ధిపేట్‌ 44, సూర్యాపేట 23, వికారాబాద్‌ 17, వనపర్తి 28, వరంగల్‌ రూరల్‌ 25, వరంగల్‌ అర్బన్‌ 41, యాద్రాది భువనగిరి 20 కేసులు నమోదయ్యాయి.

Exit mobile version