Site icon TeluguMirchi.com

తెలంగాణ లో భారీగా తగ్గినా కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 761 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నలుగురు మృతిచెందారు. ఇక, 702 మంది రికవరీ అయ్యారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,665కు చేరుకోగా.. రికవరీ కేసులు 2,55,378కు పెరిగాయి. ఇప్పటి వరకు కరోనాబారిన పడి 1448 మంది మృతిచెందారు. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 136 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

ఇక దేశంలో కరోనా మరణాల శాతం 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54కు పడిపోయింది. ఇక, రికవరీ రేటు దేశవ్యాప్తంగా 93.6 శాతంగా ఉంటే.. తెలంగాణ మాత్రం 95.40 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,839 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 8,651 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Exit mobile version