Site icon TeluguMirchi.com

తెలంగాణ కరోనా అప్డేట్ : 862 కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నిన్న కాస్త పెరిగిన కేసులు..ఈరోజు తగ్గుముఖంపట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 862 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. ముగ్గురు మృతి చెందారు.. ఇదే సమయంలో కరోనాబారినపడిన 961 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో… కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,66,904కు పెరగగా… రికవరీ కేసులు 2,54,676కు చేరాయి. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,444 మంది కరోనాతో మృతిచెందారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాలవారీగా కేసులు చూస్తే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 164, ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 53, జగిత్యాల్‌ 24, జనగాం 4, జయశంకర్ భూపాలపల్లి 11, జోగులమ్మ గద్వాల్‌ 4, కామారెడ్డి 9, కరీంనగర్‌ 38, ఖమ్మం 63, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 7, మహబూబ్‌ నగర్‌ 15, మహబూబాబాద్‌ 8, మంచిర్యాల్‌ 26, మెదక్‌ 9, మేడ్చల్ మల్కాజ్‌గిరి 91, ములుగు 11, నాగర్‌ కర్నూల్‌ 10, నల్గొండ 35, నారాయణ్‌పేట్‌ 8, నిర్మల్‌ 2, నిజామాబాద్‌ 13, పెద్దంపల్లి 37, రాజన్న సిరిసిల్ల 10, రంగారెడ్డి 57, సంగారెడ్డి 27, సిద్ధిపేట్‌ 20, సూర్యాపేట 28, వికారాబాద్‌ 8, వనపర్తి 11, వరంగల్‌ రూరల్‌ 12, వరంగల్‌ అర్బన్‌ 33, యాద్రాది భువనగిరి 10 కేసులు నమోదయ్యాయి.

Exit mobile version