Site icon TeluguMirchi.com

తెలంగాణ లో మళ్లీ భయపెడుతున్న కరోనా మహమ్మారి

తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం తో అంత సంతోషం వ్యక్తం చేసారు. కానీ ఇప్పుడు చలి తీవ్రత పెరగడం తో కరోనా మహమ్మారి తన పంజా మళ్లీ చూపిస్తుంది. దీంతో రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం స్టార్ట్ అయ్యాయి.

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 474 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. ఇదే సమయంలో 592 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,85,939కు పెరగగా.. ఇప్పటి వరకు 1538 మంది కరోనాతో మృతి చెందారు.. 2,78,523 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,590 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… టెస్ట్‌ల సంఖ్య 68,39,281కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version